Friday, August 8, 2025

తల్లి అక్రమ సంబంధం…కుమారుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామ పంచాయతీకి చెందిన మూడపల్లి తిరుపతితో తన తల్లి రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్థాపం చెందిన కుమారుడు (22) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగారం గ్రామంలో నివసించే రాజేశ్వరికి ఆవడం గ్రామానికి చెందిన తిరుపతితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రాజేశ్వరి భర్త, కుటుంబసభ్యులు అనేక మార్లు చెప్పినా వినకుండా రాజేశ్వరి అక్రమ సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో తల్లి అక్రమ సంబంధం గురించి తెలిసిన మృతుడు అనిల్ కారకుడైన తిరుపతికి తన

వ్యవహారం మార్చుకోవాలని చెప్పినప్పటికి మారకుండా మృతుడిని తిరుపతి తమ సంబంధానికి అడ్డు వస్తే చంపుతానని బెదిరింపులకు పాల్పడడంతో మనస్తాపానికి గురైన అనిల్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన సోదరి భర్త బైక్‌పై మంచిర్యాల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 7 గంటల సమయంలో తను ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం తిరుపతి, రాజేశ్వరిలు అని అనిల్ వాగ్మూలం ఇచ్చి చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News