Friday, March 29, 2024

అత్యధిక వయసు… అత్యల్ప వయసు గల సర్పంచులు వీరే

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: దేశంలో అత్యధిక వయస్కురాలు విద్యాదేవి, అత్యల్ప వయస్కురాలుగా అస్రుణీ ఖాన్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ ప్రాంతం చుల్‌హేరా గ్రామ పంచాయతీ నుంచి అస్రుణీ అనే యువతి 21 సంవత్సరాల 18 రోజులకే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన విద్యాదేవి అనే వృద్ధురాలు 97 సంవత్సరాల వయసులో పురానాబాస్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.  అస్రుణీ తన ప్రత్యర్థిపై 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2016 వ సంవత్సరంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో విద్యా దేవి తన ప్రత్యర్థి 207 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో మహారాష్ట్రలోని పుణే ప్రాంతం భమ్‌బూర్‌వాడి అనే గ్రామంలో 94 సంవత్సరాల వయసు గల గంగూభాయ్ నివృత్తి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో గంగూభాయ్ రెండో స్థానానికి పడిపోయారు. గతంలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతం ఇక్లాహరా గ్రామ పంచాయతీలో రాజశేఖర్ పౌజ్‌దర్ అనే యువకు 21 సంవత్సరాల ఐదు నెలలో సర్పంచ్ ఎన్నియ్యారు. దీంతో రాజశేఖర్ రెండో అత్యల్ప వయస్కుడిగా నిలిచిపోయారు.

 

Youngest, oldest Sarpanchs Details in India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News