Friday, May 3, 2024

చైన్‌స్నాచర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Youth arrested for snatching women's chains

30 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : మహిళల చైన్లను స్నాచింగ్ చేస్తున్న యువకుడిని గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 30 గ్రామలు బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చైన్ విలువ రూ.1,00,000లు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్, చిలకగలగూడ, హమాల్ బస్తీకి చెందిన బునిందు కావలి రమేష్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చేగురి పద్మ(50) ఈ నెల 4వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో చిలకలగూడ ఆఫీస్ నుంచి ఇంటికి నడుచుకుంటు వెళ్తోంది. ఉదయం 11.40 గంటలకు నిందితుడు ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి కొట్టి చైన్‌స్నాచింగ్ చేసి పారిపోయాడు. బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సిసిటివి ఫుట్‌జ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడు రేతిఫిల్ బస్టాప్‌లో అనుమానస్పదంగా తిరుగుతుండా అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ సాయిఈశ్వర్ గౌడ్, డిఐ కోటయ్య, ఎస్సై డిఎస్సై పాండురాజు తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News