Saturday, May 4, 2024

గంగా ఘాట్‌లో హిందూయేత‌రుల‌కు నో ఎంట్రీ: హరిద్వార్ పోలీసుల దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడానికి వీల్లేదంటూ హిందుయేత‌రుల‌ బృందాన్ని ఒక యువకుడు అడ్డుకుంటున్న దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ కావడంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

హరిద్వార్‌లో ప్రసిద్ధి చెందిన మహారాజా అగ్రసేన్ ఘాట్ వద్ద ఈ ఘంటన జరిగినట్లు ఈ వీడియో ప్రకారం తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం సున్నితమైనందున ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలంటూ సర్కిల్ ఆఫీసర్ జుహీ మున్రాల్ ఒక సీనియర్ పోలీసు అధికారిని ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు హరిద్వార్ నగర పోలీసు సూపరింటెండెంట్ స్వతంత్ర కుమార్ తెలిపారు. ఈ సంఘటనతో సంబంధమున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

గంగా ఘాట్ల వని హిందువులు తప్ప అన్యమతస్తులు స్నానమాచరించడానికి వీల్లేదంటూ ఒక యువకుడు హిందుయేత‌రులు కొందరిని అడ్డుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ యువకుడితో బృందంలోని ఒక యువకుడు, యువతి వాదనకు దిగడం కనిపించింది. హర్ కీ పౌరీ ప్రాంతంలో తాను వాహనాన్ని నడుపుతానంటూ బృందంలోని సభ్యుడు ఒకరు చెప్పగా అతని మాటలు వినడానికి ఆ యువకుడు నిరాకరించాడు. గంగా ఘాట్‌ను వదిలి వెళ్లిపోవాలంటూ ఆ యువకుడు వారిని హెచ్చరించడం వీడియోలో కనిపించింది.

కాగా..ఈ వీడియోపై హరిద్వార్ మున్సిపాలిటీ(ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయింది) మాజీ చైర్మన్, కాంగ్రెస్ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు సత్పాల్ బ్రహ్మచారి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా తీవ్రమైనవని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం&హరిద్వార్‌లోను, కంఖాల్ పోలీసు స్టేషన్ పరిధిలోను హిందుయేత‌రుల‌కు శాశ్వత నివాసం వీల్లేదని, హర్ కీ పౌరీ ప్రాంతంలో కూడా హిందుయేత‌రుల‌కు ప్రవేశం నిషిద్ధమని ఆయన తెలిపారు. అయితే, జ్వాలాపూర్ కొత్వాలీ పరిధిలోకి వచ్చే మహారాజా అగ్రసేన్ ఘాట్ వద్ద మాత్రం ఎటువంటి నిషేధం లేదని, గంగా ఘాట్‌లో ఏ మతస్తులైనా స్నానం ఆచరించవచ్చని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News