Thursday, March 23, 2023

హిమాయత్ నగర్ లో కారు బీభత్సం

- Advertisement -

హైదరాబాద్: హిమాయత్ నగర్ లో సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్ లోని రోడ్ నం. 15 లో ఓ కారు అతివేగంతో సిపిఐ కార్యాలయం ప్రహరీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడకు ఆనుకొని ఉన్న మరో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వసం అయ్యింది.

ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు,స్థానికులు గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు పోలీస్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News