Thursday, May 2, 2024

బాలుడిని లైంగికంగా వాడుకుని…

- Advertisement -
- Advertisement -

Exploit gold by sexually harassing boy

 

హైదరాబాద్: బాలుడిని లైంగికంగా వాడుకోవడమే కాకుండా వీడియో రికార్డింగ్స్‌ బయటపెడతానంటూ బెదిరించి బంగారం, నగదు దోచుకున్న మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టోలీచౌకిలోని సాలార్‌జంగ్‌ కాలనీలో నివాసముండే మహిళ (34) తన కుటుంబంతో సహా రెండు నెలల కిందట గాయత్రీహిల్స్‌కి మకాం మారింది. ఆ సమయంలో కొన్ని నగలు కనిపించకపోవడంతో అనుమానంతో కొడుకు(14)ను గట్టిగా ప్రశ్నించింది. బెంగళూరులో ఉండే మేనత్త (33)కు ఆభరణాలు ఇచ్చానని చెప్పాడు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చే మేనత్త నేరుగా తన స్కూల్‌కు వచ్చేదని, చార్మినార్‌ ప్రాంతంలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి లైంగికంగా వాడుకుందని, ఆ మొత్తం వ్యవహారాన్ని ఇర్ఫాన్‌ అనే వ్యక్తి వీడియోలు తీశాడని వెల్లడించాడు. ఆ వీడియోలు బయటపెడతామంటూ ఇద్దరూ బెదిరించడంతో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షల నగదు వారికి ఇచ్చానని చెప్పాడు. దీంతో బాలుడి తల్లి షాక్ కు గురైంది. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News