Thursday, May 2, 2024

శంషాబాద్‌లో 16 ఖరీదైన కార్ల సీజ్

- Advertisement -
- Advertisement -

16 Expensive cars Seized in Shamshabad

ఉపరవాణా కమిషనర్ పాపారావు నేతృత్వంలో దాడులు
దాడుల్లో పాల్గొన్న 40 మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు
రూ.8 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడిన వాహన చోదకులు

హైదరాబాద్:  శంషాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం నాడు రవాణా శాఖ ఉపరవాణా కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) డాక్టర్ కె. పాపారావు నేతృత్వంలో రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర రోడ్డు టాక్స్ ఎగవేస్తూ తిరుగుతున్న 16 విదేశీ వాహనాలపై వాహనాలపై కేసులు నమోదు చేశారు. కాగా పన్ను చెల్లించకుండా తిరుగుతున్న విదేశీ వాహనదారుల నుండి సుమారు రూ.8 కోట్లు మేరకు వసూలు చేయనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో రాజకీయ, సినీ, రియాల్టర్ రంగాలకు చెందిన ప్రముఖులు హై ఎండ్ లగ్జరీ కార్లను వినియోగిస్తూ రాష్ట్రానికి రావాల్సిన పన్నును ఎగవేస్తున్నట్లు రవాణాశాఖ ఉప రవాణా కమిషనర్ డాక్టర్ పాపారావు దృష్టికి వచ్చింది. దీంతో నగరంలోని అత్యంత సంపన్నులు ఖరీదైన కార్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

దాదాపు ఆరునెలల కాలంగా ఖరీదైన కార్లపై నిఘాలో భాగంగా ఖరీదైన వాహనాలు తిరిగే ప్రాంతాలను గుర్తించారు. అదేవిధంగా ఆయా వాహనాలపై నిఘా సారించిన ఉప రవాణా కమిషనర్ పాపారావు ఆదివారం నాడు మధ్యాహ్నం 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్, మోటర్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ల బృందాలతో హై ఎండ్ కార్ల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనీఖీలలో మెర్సిడస్ బెంజ్, మాసరట్టి, పెర్రారి, రోల్స్ రాయిస్, బియండబ్ల్యూ, లాంబోర్గీని వివిధ కంపెనీల కు చెందిన కోట్ల రూపాయల ఖరీదు చేసే 16 లక్జరీ వాహనాలను సీజ్ చేశారు. కాగా సీజ్ చేసిన వాహనాల ద్వారా దాదాపు రూ. 8 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరనుందని ఉపరవాణా కమిషనర్ పాపారావు వివరించారు.

అదేవిధంగా రూ. 50 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి పరోక్షంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) డాక్టర్ కె. పాపారావు మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన పన్ను ను చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, వాటిని గుర్తించి వెంటనే సీజ్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హై ఎండ్ లక్జరీ కార్లను కొనుగోలు చేసిన యజమానులు వెంటనే ఆయా వాహనాలకు పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.ఈ దాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) డాక్టర్ కె. పాపారావు అభినందించారు.

రాష్ట్రంలో తొలిసారి…

ఏళ్లతరబడి రవాణా శాఖకు పన్నులు ఎగవేస్తూ తిరుగుతున్న ఖరీదైన కార్లపై దాడులు నిర్వహించడం రవాణశాఖ చరిత్రలో ఇదే మొదటి సారి అని ఆ శాఖ అధికారులు వివరిస్తున్నారు. శ్రీమంతులు,పలుకుబడి గల వారి వాహనాలపై దాడులు నిర్వహించి సీజ్ చేయడంపై పలువురు రవాణాశాఖ అధికారులను ప్రశంసిస్తున్నారు. ఇంతకాలం సామాన్యులపైనే ప్రతాపం చూపిస్తారన్న ఆరోపణలకు చమరగీతం పాడుతూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎలాంటి వాహనాలనైనా సీజ్ చేయడం జరుగుతుందని రవాణా శాఖ అధికారులు నిరూపించారని పలువురు చర్చించుకోవడం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News