Tuesday, April 30, 2024

అజర్‌బైజాన్-ఆర్మీనియాల మధ్య ఘర్షణ: 176 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బాకు: అజర్‌బైజాన్-ఆర్మీనియా దేశాల సరిహద్దుల వద్ద గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వారం వ్యవధిలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 176 మంది సైనికులు ప్రాణాలర్పించారు.   71 మంది అజర్‌బైజాన్ సైనికులు మృతి చెందారని ఆ దేశం ప్రకటించింది.   తమ దేశపు సైనికులు 105 మంది చనిపోయారని ఆర్మీనియా భద్రతా దళాలు వెల్లడించాయి. నగోర్నో-కరబాఖ్ ప్రాంతాలను దక్కించుకోవడం కోసం రెండు దేశాలు 2021 నుంచి యుద్ధం చేస్తున్నాయి. 1920 నగోర్నో-కరభాక్ ప్రాంతాలను అజర్‌బైజాన్ దేశంలో కలిపేశారు. ఈ ప్రాంతాలలో 90 శాతం ప్రజలు ఆర్మీనియన్లు ఉండడంతో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ రెండు దేశాలు పలుమార్లు యుద్ధం రంగంలోకి దిగాయి. 1990లో ఆర్మీనియా వేర్పాటువాదులు ఆ రెండు ప్రాంతాలను ఆక్రమించినప్పుడు పెద్ద యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 30వేల మంది నెలకొరిగారు. 2021 నుంచి ఇప్పటి వరకు జరిగిణ ఘర్షణల్లో దాదాపులో 5000 మంది మరణించారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News