Saturday, July 27, 2024

పంజాబ్ లో రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దీంతో రెండు రైళ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్‌లు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన లోకో పైలట్‌లను చికిత్స కోసం శ్రీ ఫతేఘర్ సాహిబ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రికి రిఫర్ చేశారు.

“తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. మేము సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాం. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇద్దరు లోకో పైలట్లు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించాం” అని సిర్హింద్ ప్రభుత్వ రైల్వే పోలీస్ రతన్ లాల్ తెలిపారు. ఇద్దరు లోకో పైలట్‌లు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ కు చెందిన వారని ఫతేగర్ సాహిబ్ సివిల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఇవాన్‌ప్రీత్ కౌర్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News