Friday, May 3, 2024

22 యు ట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

22 YouTube channels blocked

న్యూఢిల్లీ : దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బ్లాక్ చేసింది. ఇందులో 18 చానెళ్లు భారత్‌కు చెందినవి కాగా, మరో 4 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లని ఆ శాఖ స్పష్టం చేసింది. ఐటీ రూల్స్, 2021 ప్రకారం తొలిసారిగా 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసినట్టు తెలిపింది. యూట్యూబ్ వీక్షకులను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని టీవీ ఛానెళ్ల లోగోలను కూడా ఈ యూట్యూబ్ ఛానెళ్లు ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. తప్పుడు థంబ్ నెయిల్స్‌తో ప్రజలను గందరగోళ పరిచినట్టు తెలిపింది. వీటితోపాటు 3 ట్విటర్ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్ అకౌంట్, ఒక న్యూస్‌వెబ్‌సైట్‌ను కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బ్లాక్ చేసింది. భారత్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్ చానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రకటనలో తెలిపింది.

నిషేధం విధించిన యూట్యూబ్ ఛానెళ్ల మొత్తం వీక్షణల సంఖ్య 260 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఆయా ఛానెళ్లు తమ కార్యక్రమాలను నడిపిస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా అవాస్తవ సమాచారం వైరల్‌గా మారేందుకు ఇమేజ్‌లు, టైటిళ్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్టు తెలిపింది. పాకిస్థాన్ చానెళ్లు కూడా ఇదే విధంగా భారత్‌కు వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశ సమగ్రత, జాతీయ భద్రత విషయాల్లో ప్రజలను తప్పుతోవ పట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విశ్వసనీయమైన, ప్రామాణిక వార్త ప్రసారాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ ఇవే…

ఎఆర్‌పి న్యూస్, ఎఒపి న్యూస్, ఎల్‌డిసి న్యూస్, సర్కారీబాబు, ఎస్‌ఎస్ జోన్ హిందీ, స్మార్ట్ న్యూస్, న్యూస్ 23 హిందీ, ఆన్‌లైన్ ఖబర్, డిపి న్యూస్, పికెబి న్యూస్, కిసాన్ టాక్, బొరానా న్యూస్, సర్కారీ న్యూస్ అప్‌డేట్, భారత్ మౌసం, ఆర్‌జె జోన్ 6, ఎగ్జామ్ రిపోర్టు, డిగి గురుకుల్, దిన్‌భర్ కీర్వబరో. పాక్ యూట్యూబ్ చానెల్స్ దునియామేరీ ఆగీ, గులామ్ నబీమద్నీ, హకీకత్ టివి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News