Thursday, May 2, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 ఖేలో ఇండియా సెంటర్లు

- Advertisement -
- Advertisement -

నల్గొండ :ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా హాకీ (2 సెంటర్లు) కబడ్డీ 1 సెంటర్ లను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాకీ, కబడ్డీ క్రీడాకారులు క్షేత్ర స్థాయి నుండి తయారు కావడానికి ఖేలో ఇండియా సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తూ హాకీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కూతురు శ్రీనివాసరెడ్డి ఇమామ్ కరీమ్ లకు, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అయిన రామచంద్ర గౌడ్ నామా నరసింహరావులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News