Sunday, April 28, 2024

ముదిరిన జలజగడం

- Advertisement -
- Advertisement -


ఖకీల వలయంలో జలాశయాలు
ప్రాజెక్టుల వద్ద ముడంచెల భద్రత
సాగర్, పులిచింతలకు భారీ బందోబస్తు
సాగర్‌లో 400మంది పోలీసులతో భద్రత
ఎపి అధికారులను అడ్డుకున్న పోలీసులు
జూరాల ఆనకట్టపై రాకపోకలు నిలిపివేత
షిఫ్టుల వారీగా పోలీసుల విధులు
డ్యాంల వద్ద ఉద్యోగులకు మాత్రమే అనుమతి
భద్రత నడుమ విద్యుత్ ఉత్పత్తి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో నాగార్జునసాగర్, పులిచింతల,జూరాల ప్రాజెక్టులతో పాటు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సాగర్ ప్రధాన డ్యాం, జల విద్యుత్ కేంద్రాల వద్ద 400 మంది పోలీసు సిబ్బంది మోహరించగా, పులిచింతల ప్రాజెక్టు వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. ఈక్రమంలో షిఫ్టులవారీగా 90మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. ప్రాజెక్టులకు వెళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసు భద్రత నడుమ ఈ కేంద్రాల్లో జెన్‌కో అధికారులు విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం వద్ద మూడు రోజలుగా పోలీసు భారీ భద్రత కొనసాగుతోంది. ఆనకట్ట, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఉద్యోగులు మినహా ఇతరులెవరినీ పవర్ హౌజ్‌లోకి అనుమతించడం లేదు. జూరాల, పులిచింతల జలాశయాల వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వివాదం దృష్ట్యా జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల వద్ద నలుగురు డిఎస్పీలు, ఆరుగురు సిఐలు, 16 మంది ఎస్‌ఐలతో పాటు ఎస్‌పిఎఫ్, గ్రేహౌండ్స్‌కు చెందిన వందలాది మంది పోలీసు ప్రాజెక్టు వద్ద పహారా కాస్తున్నారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద భారీగా సాయుధ బలగాల మోహరించారు. ఉద్యోగులు మినహా ఎవరినీ పవర్‌హౌస్‌లోకి అనుమతించడం లేదు. జూరాల ఆనకట్టపై పోలీసులు రాకపోకలు నిలిపివేయడంతో పాటు జూరాల జల విద్యుత్ కేంద్రం వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. కాగా ఎపి సరిహద్దు అయిన సాగర్ బ్రిడ్జి వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
సాగర్‌లోని ఏపి అధికారులను వెనక్కి పంపిన రాష్ట్ర పోలీసులు
ఎపి అధికారులను అడ్డుకున్న పోలీసులు ః
నాగార్జునసాగర్‌లోని తెలంగాణ జెన్‌కో నుంచి విద్యుదుత్పత్తి ఆపాలని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఎపి అధికారులను తెలంగాణ పోలీసులు గురువారం అడ్డుకున్నారు. మాచర్ల నుంచి సాగర్‌కు చేరుకున్న మాచర్ల డిఎస్‌పి, ఆర్‌డివొ, ఎన్‌ఎస్‌పి, ఎస్‌ఇని నూతన వంతెన వద్ద అడ్డుకున్నారు. పోలీసులు లోపలికి వెళ్లేందుకు అనుమంతించలేదు. విద్యుద్పుత్తి కేంద్రం వద్దకు వెళ్లేందుకు అనుమంతించాలని ఎపి అధికారులు కోరగా రాష్ట్ర పోలీసులు అధికారులకు ఫోన్ చేయగా తాము వినతిపత్రం స్వీకరించలేమని తెలిపారు. వినతిపత్రాన్ని డిఐజికి ఇవ్వాలని సమాధానం చెప్పడంతో ఎపి అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు.
ప్రయాణాలు బంద్ ః
తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి సమస్యల మీద ముదురుతున్న జల వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు భద్రతా కారణాల దృష్ట్యా ప్రాజెక్టు మీద రాకపోకలను బందు చేయడం జరిగింది. ప్రాజెక్టు మీద పోలీసుల పర్యవేక్షణ ఉన్నది. ఎవరిని కూడా వదలడం లేదు. దాంతో గద్వాల ఆత్మకూరు మక్తల్ తదితర ప్రాంతాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ సమయంలో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరుతున్నారు.
ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ః
ప్రాజెక్ట్ ల వద్ద భద్రత ఇప్పటికే ఏపీ పోలీసులు సైతం ప్రాజెక్ట్ ల వద్ద భారీగా మోహరించారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాజోలఇప్పటికే ఏపీ పోలీసులు సైతం ప్రాజెక్ట్ ల వద్ద భారీగా మోహరించారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని కర్నూలు ఎస్‌పి ఫకీరప్ప వెల్లడించారు. అవసరమైతే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ విధిస్తామని ఎవరూ అక్కడికి వెళ్లొద్దని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. బండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని ఎస్‌పి ఫకీరప్ప వెల్లడించారు. ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ విధిస్తామని ఎవరూ అక్కడికి వెళ్లొద్దని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
ఎపి పోలీసుల బందోబస్తు ః
2015లో తెలంగాణ, ఎపి పోలీసుల మధ్య సాగర్ ప్రాజెక్టుపైనే గొడవ జరిగింది. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రస్తుతం డ్యాం వద్ద బందోబస్తు కొనసాగిస్తున్నారు. పులిచింతల వద్ద విద్యుదుత్పత్తిఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎపి ప్రభుత్వం పోలీసులను మోహరించింది. తెలంగాణ విద్యుదుత్పత్తి దృష్ట్యా ఆ ప్రభుత్వం భద్రతను పెంచింది. పులిచింతల జలాశయం వద్ద సూర్యాపేట జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక దళాలు భద్రతలో ఉన్నాయి. రెండ్రోజుల నుంచి పులిచింతలలో పోలీసుల భద్రత నడుమ తెలంగాణ జల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఇదిలావుండగా శ్రీశైలండ్యాం వద్దకు ఇరువైపుల ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా చేరుకున్నారు. శ్రీశైల డ్యాం ఎడమగట్టు గేటు వద్ద రాష్ట్ర పోలీసులు పహార కాస్తున్న క్రమంలో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు.

400 TS Police deployed at Nagarjuna Sagar Dam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News