న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. కరోనా నుంచి ఈరోజు 427 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,755కు చేరింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 148కు చేరింది. ఇప్పటివరకు 4,202 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 5,405 మంది వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 91 వేలకు చేరుకోగా 2896 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 47 లక్షలకు చేరుకోగా 3.13 లక్షల మంది మరణించారు. భారత దేశంలో కరోనా రోగుల సంఖ్య మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా బాధితులు సంఖ్య 30 వేల పైగా ఉండగా 1135 మంది చనిపోయారు. ఒక్క ముంబయిలో 20 వేలకు పైగా కరోనా కేసులున్నాయి
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:
రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు | బాధితుల సంఖ్య | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
30,706 | 22,483 | 7,088 | 1,135 |
|
10,989 | 6,056 | 4,308 | 625 |
తమిళనాడు | 10,585 | 6,973 | 3,538 | 74 |
ఢిల్లీ | 9,333 | 5,278 | 3,926 | 129 |
రాజస్థాన్ | 5,030 | 1,911 | 2,991 | 128 |
|
4,790 | 2,232 | 2,315 | 243 |
|
4,258 | 1,713 | 2,441 | 104 |
|
2,576 | 1,452 | 892 | 232 |
|
2,355 | 953 | 1,353 | 49 |
పంజాబ్ | 1,946 | 657 | 1,257 | 32 |
|
1,509 | 504 | 971 | 34 |
బిహార్ | 1,178 | 731 | 440 | 7 |
జమ్ము కశ్మీర్ | 1,121 | 567 | 542 | 12 |
కర్నాటక | 1,092 | 559 | 496 | 36 |
హర్యానా | 887 | 360 | 514 | 13 |
ఒడిశా | 828 | 627 | 196 | 5 |
|
588 | 87 | 497 | 4 |
ఝార్ఖండ్ | 217 | 101 | 113 | 3 |
ఛండీగఢ్ | 191 | 137 | 51 | 3 |
త్రిపుర | 167 | 103 | 64 | 0 |
అస్సాం | 96 | 52 | 41 | 2 |
|
91 | 39 | 51 | 1 |
హిమాచల్ ప్రదేశ్ | 78 | 33 | 39 | 3 |
ఛత్తీస్ గఢ్ | 67 | 9 | 58 | 0 |
లడఖ్ | 43 | 19 | 24 | 0 |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 0 | 33 | 0 |
|
20 | 13 | 7 | 0 |
పుదుచ్చేరీ | 16 | 7 | 9 | 0 |
|
13 | 1 | 11 | 1 |
మణిపూర్ | 7 | 5 | 2 | 0 |
మిజోరం | 1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
మొత్తం | 90,813 | 53,662 | 34,271 | 2,875 |
422 New Corona positive cases in Delhi