Thursday, May 2, 2024

భారత్ లో 80లక్షలకు చేరువైన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

43893 new COVID 19 infections in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 43,893 కొత్త కోవిడ్-19 కేసులు, 508 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 79,90,322కు పెరిగాయి. దేశవ్యాప్తంగా 1,20,010 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. ఇండియాలో ప్రస్తుతం 6,10,803 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 72,59,509 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రెటు 90.85శాతం, మరణాల రేటు 1.50శాతం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27 వరకు మొత్తం 10,54,87,680 మంది నమూనాలను పరీక్షించగా… వీటిలో నిన్న ఒక్కరోజే 10,66,786 నమూనాలను పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

43893 new COVID 19 infections in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News