ఆపరేషన్ సిందూర్ భారతీయ వాయుసేన నిర్వహించిన విజయవంతమైన సైనిక చర్య అని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఉగ్రవాద శిబిరాల ధ్వంసానికి ఉద్ధేశించిన ఈ దాడులలో మనం ఐదు పాకిస్థానీ ఫైటర్ జెల్లను కూల్చేశాయని తెలిపారు. ఇందులో ఒకటి అతి పెద్ద విమానం అని వివరించారు. శనివారం ఇక్కడ జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్‌ఎం కత్రే 16వ స్మారకోపన్యాస సభలో ఈ విషయాలను ఆయన తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. భారతీయ వాయుసేన ఇంతకు ముందెన్నడు జరపని తీవ్రస్థాయి సైనిక చర్చగా నిలిచిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లక్షం విజయవంతం అయిందని పరోక్షంగా వివరించారు. పాక్ స్థావరాల్లో ఉన్న కొన్ని ఎఫ్ 16లు ఒక ఎడబ్లుసి హాంగర్‌ను కూల్చివేయడం జరిగింది. ఈ దశలో ఆ వైపున ఐదుగురు పైలట్లు మృతి చెందినట్లు తమకు సమాచారం ఉందని వివరించారు. సరిహద్దులకు ఆవల దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఈ చర్య జరిగిందని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ దశలో పలు మానవరహిత వైమానిక వాహనాలు (యుఎవి(, డ్రోన్లు, కొన్నిరకాల క్షిపణుల ధ్వంసం జరిగింది. వీటి శకలాలు భారతీయ భూభాగంలో పడ్డాయని వివరించారు. మనకు నిర్థిష్ట రీతిలో అందిన ఇంటలిజెన్స్ సమాచారంతో పాకిస్థాన్‌లోని షహబాజ్ జకోబాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌పై దాడికి దిగినట్లు వివరించారు. అక్కడి ప్రధాన బిల్డింగ్‌పై దాడి జరిగింది. అదే విధంఆ సుక్కుర్ ఎయిర్‌బేస్ వద్దనే పాకిస్థాన్‌కు ఎక్కువగా నష్టం వాటిల్లిందని తెలిపారు. తాము సాగించిన దాడి ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో సాగిన సర్ఫేస్ టు ఎయిర్ దాడి అని చెప్పారు. 80 నుంచి 90 గంటల వ్యవధిలోనే లక్షాల ఛేదన జరిగింది. తీవ్రనష్టం జరగదని గ్రహించే పాక్ సైనిక చర్య నిలిపివేతకు ప్రాధేయపడిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం గురించి పైగా పాక్ వైపు జరిగిన నష్టం గురించి భారతదేశం సైనిక విభాగం నుంచి స్పందన వెలువడటం ఇదే తొలిసారి.