Tuesday, December 3, 2024

నిఘా పెరిగింది… నగదు దొరికింది

- Advertisement -
- Advertisement -

గత ఎన్నికల్లో నగరంలో రూ.27కోట్లు స్వాధీనం
ఈ ఎన్నికల్లో రూ.63కోట్లు సీజ్
వాహన తనిఖీలు, చెక్ పోస్టులు ఏర్పాటు
భారీగా పట్టుబడ్డ నగదు

మనతెలంగాణ, సిటీబ్యూరోః ఎన్నికల నేపధ్యంలో నగర పోలీసులు తనిఖీలు పకడ్బంధీగా నిర్వహించడంతో భారీగా నగదు పట్టుబడింది. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో నగరంలో ఇంత నగదు పట్టుబడలేదు. 2014 ఎన్నికల్లో నగరంలో కేవలం రూ.12,11,250 నగదు నగరంలో పట్టుబడగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.27,03,76,991 నగదు పట్టుబడింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు భారీ ఎత్తున నగదును పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.63కోట్లను పోలీసులు సీజ్ చేశారు. నగరంలో చెక్‌పోస్టులు, తనిఖీలు ముమ్మరం చేయడంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరపడింది.

ఎక్కడికక్కడ తనిఖీలను చేయడంతో భారీ స్థాయిలో నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీ చేస్తుండగా హవాలా డబ్బులు తీసుకుని వస్తుండగా బేగంబజార్, ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పోలీసులు భారీ ఎత్తున నగదును పట్టుకున్నారు. కమీషన్ తీసుకుని ఓ వ్యాపారి వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కమీషన్ తీసుకుని హవాలా వ్యాపారుల నగదును తరలిస్తున్నారు. హవాలా వ్యాపారులు వివిధ రాష్ట్రల నుంచి డబ్బును తెప్పిచ్చి కమీషన్ తీసుకుని రాజకీయ నాయకులకు చేరవేశారు.

దీంతో నగరంలో భారీ స్థాయిలో నగదు పట్టుబడింది. అన్ని పార్టీలకు చెందిన నాయకుల అనుచరులు డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈ ఎన్నికల్లో స్కూటీల్లో నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. నగదు తరలిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నిదారులు ఉంటే అన్ని దారుల్లో నగదును సరఫరా చేసేందుకు రాజకీయ నాయకులు వెనుకాడలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News