Sunday, May 5, 2024

విషాద ఘటన: 9మంది అగ్నిమాపక సిబ్బంది దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

9 Firefighters died after cave collapse in Brazil

బ్రసిలియా: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలి 9మంది దుర్మరణం చెందిన ఘటన ఆదివారం బ్రెజిల్ లోని అల్టినోపోలిస్‌ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అల్టినోపోలిస్‌ నగరానిక సమీపంలోని కేవ్‌ గుహలో 26మంది శిక్షణ తీసుకుంటున్న అగ్నిమాపక సిబ్బంది బృందం ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గుహ పైకప్పు కుప్పకూలడంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, ఆరుగురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. బాధితుల వివరాలు వెల్లడించలేదు. సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, సహాయక సిబ్బంది ఒకరిని రక్షించారని, మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

9 Firefighters died after cave collapse in Brazil

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News