Friday, May 3, 2024

విమానంలోనే ప్రసవం

- Advertisement -
- Advertisement -

Kolkata-airport

కోల్‌కతా: దోహా నుంచి బ్యాంకాక్ వెడుతున్న విమానంలో ప్రయాణిస్తున్న థాయ్‌లాండ్ మహిళకు విమానంలోనే పురిటి నొప్పులు వచ్చి, ఆకాశయానంలోనే బాబును ప్రసవించింది. దాంతో విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ఆపాల్సి వచ్చింది. ‘కతార్ ఎయిర్ వేస్‌కు చెందిన కేబిన్ సిబ్బంది సాయంతో తెల్లవారు జామున 3 గంటలకు ఆమె మగశిశువును కన్నది. విమానం కోల్‌కతాలో ల్యాండ్ అయిన తర్వాత ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీ బిడ్డ బాగున్నారు’ అని అధికారులు చెప్పారు. ‘దోహా నుంచి బ్యాంకాక్ వెళ్లే క్యూఆర్ 830 షెడ్యూల్‌లో లేని విమానం తెల్లవారు జామున 3.09 గంటలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో వైద్య సహాయం అందుబాటులో ఉండేచోట దిగింది. పైలట్ ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఆ మహిళకు వైద్యునితో ఉన్న ఎయిర్‌పోర్ట్ టీమ్ తోడ్పడుతున్నారు’ అని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అధికారి చెప్పారు.

Thailand national gives birth during flight

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News