Sunday, May 19, 2024

రేషన్ బియ్యాన్ని ఈ-పాస్ యంత్రాల ద్వారా పంపిణీ చేయాలి

- Advertisement -
- Advertisement -

 

* రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా వైరస్ కట్టడి దృష్ట్యా తెలంగాణ విధించిన కర్ఫ్యూ నేపథ్య ంలో రేషన్ బియ్యాన్ని ఈ పాస్ యంత్రాల ద్వారా పంపిణీ చేయాలని రాష్టా పౌరసరఫరాల శాఖ కమిషనర్ జిల్లా అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 12 కేజీల బియ్యాన్ని ఈ పాస్ యంత్రాల ద్వారా పంపిణీ చేయాలని సూచించా రు. లారీల ద్వారా త్వరగా బియ్యాన్ని గ్రామాలకు చేరవేయాలని ఆదేశించారు. అదనపు బియ్యాన్ని గ్రామాల్లోని స్కూల్స్ లేదా ప్రభుత్వ గోదాంలలో నిల్వ చేయాలని తెలిపారు.

రేషన్ కార్డుదారునికి పంపిణీ రూ. 1500 నిత్యవసర సరుకుల కోసం ఆన్‌లైన్ ద్వారా లబ్ధ్దిదారులకు చెల్లింపు జరుపుతామని అన్నారు. రానున్న రబీ సీజన్ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సకాలంలో కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని, వీలైనన్ని ఎక్కువ సెంటర్లను తెరవాలని పేర్కొన్నారు. గత సీజన్లలో పెండింగ్‌లో ఉన్న ధాన్యం కొనుగోలు కమిషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ రాజునాయక్, డిప్యూటీ తహసీల్దార్ సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

 

Ration rice delivered by epass machines
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News