Monday, May 13, 2024

మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంచుతూ ఎపి ప్రభుత్వం ఆదేశం

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: మందు బాబులకు ఎపి ప్రభుత్వం షాకిచ్చింది. సోమవారం నుంచి రాష్ట్రంలో వైన్ షాపులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఎపి ప్రభుత్వం కొత్త మద్యం ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట మద్యం ధరలను భారీగా పెంచుతూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఎపిలో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ఎపి ప్రభుత్వం ఆదేశించింది. వైన్ షాపులను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవనున్నారు. మద్యం విక్రయాలపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. రూ.120 విలువైన మద్యం బ్రాండ్ ల క్వార్టర్ పై రూ.20, హాఫ్ బాటిల్ పైరూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80 పెంచగా, రూ.120-150 విలువైన మద్యం బ్రాండ్ ల క్వార్టర్ పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.80, ఫుల్ బాటిల్‌పై రూ.120 పెంచారు. రూ.150 విలువైన మద్యం బ్రాండ్ ల క్వార్టర్ పై రూ.60, హాఫ్ బాటిల్‌పై రూ.120, ఫుల్ బాటిల్‌పై రూ.240 పెంచారు. ఇక, మినీ బీర్ పై రూ.20, ఫుల్ బీర్ పై రూ.30 పెంచారు.

AP Govt Orders issued increases Alcohol Prices

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News