Monday, April 29, 2024

చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో మూవీకి చరణ్ ప్లాన్!

- Advertisement -
- Advertisement -

 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్ర చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో చిరు సరసన మరోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ చేయనున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో మోహన్‌లాల్ పాత్రలో చిరు నటిస్తుండగా, పృథ్వీరాజ్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ముందు ఈ పాత్రలో రామ్ చరణ్ నే నటిస్లున్నాడని పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ పాత్రలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ చిత్రం కొత్త రికార్డ్స్ క్రీయేట్ చేస్తుందనడంలో సందేహమేలేదు. దీనిపై చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించాల్సి ఉంది. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నట్లు చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Salman Khan Special Role in Chiranjeevi’s Lucifer Remake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News