Sunday, May 5, 2024

కరోనా వైరస్‌ను అడ్డుకొంటున్న హెపటైటిస్‌ సి మందు

- Advertisement -
- Advertisement -

 

జర్మనీ శాస్త్రజ్ఞుల అధ్యయనంలో వెల్లడి

బెర్లిన్: హెపటైటిస్‌-సి చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కోవిడ్19ను సమర్థవంతంగా అడ్డుకోగలవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్‌లో విస్తృత గణనలను ఉపయోగించి దీనిని నిర్వహించారు. జర్మనీలోని జొహాన్నెస్ గుటెన్‌బర్గ్ యూనివర్శిటీ మైంజ్( జెజియు) పరిశోధకులు సార్స్‌కోవిడ్2 ప్రొటీన్లను బంధించే 42,000 పదార్థాలను సిమ్యులేట్ చేశారు. అత్యంత శక్తిమంతమైన మోగాన్ 2 సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించి ఆ పదార్థాలు కరోనా పునరుత్పత్తిని అడ్డుకుంటాయో లేదో పరీక్షించారు. ఇందుకోసం రెండు నెలల్లోనే ఏకబిగిన 3000 కోట్ల గణనలను చేపట్టారు. హెపటైటిస్ సి చికిత్సకు ఉపయోగించే సిమిప్రివిర్,పరిటప్రివిర్,గ్రజోప్రివిర్,వెల్పటస్విర్ ఔషధాలు కోవిడ్19ను అడ్డుకునేలా కనిపిస్తున్నాయని తెలిపారు. సార్స్‌కోవ్2తో మాలిక్యులర్ డాకింగ్‌ను మొదట ఉపయోగించింది మేమే.

కోవిడ్19 చికిత్సకు హెపటైటిస్‌సి ఔషధాలు సమర్థవంతంగా పని చేస్త్తాయని తెలియడం గొప్ప శుభవార్త. ఎందుకంటే కోవిడ్19, హెపటైటిస్‌సిలో ఉండే వైరస్ ఒకే జాతికి చెందినది. ఏకపోగు ఆర్‌ఎస్‌ఎ వైరస్సే’ అని ప్రొఫెసర్ థామస్ ఇఫెర్త్ అన్నారుజ జపాన్‌లో దొరికే సహజ మూలిక హనీసకిల్(లోనిసెరా జపోనికా) కూడా కోవిడ్19 చికిత్సకు ఉపయోగపడవచ్చని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఆసియాలో వివిధ వ్యాధులకు చాలా ఏళ్లుగా దీన్ని వాడుతున్నారు. శాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్స్ చేపట్టి తమ పరిశోధన ఫలితాలను తనిఖీ చేయాలని పరిశోధకులు కోరుతున్నారు. గతంలో మెర్స్‌కోవ్, సార్స్‌కోవ్‌కు మాలిక్యులర్ డాకింగ్ విజయవంతంగా ఉపయోగపడిందని వారు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News