Tuesday, May 14, 2024

తెలంగాణలో ఆర్టీసీ సర్వీసులు పున:ప్రారంభం

- Advertisement -
- Advertisement -

TS-RTC

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. జిహెచ్ఎంసి పరిధి మినహా ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు జరుగుతున్నాయి. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు నగర శివారు ప్రాంతాలకు వరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇమ్లీబన్ డిపో, దిల్ సుఖ్ నగర్ డిపోల్లోకి బస్సుల అనుమతికి సర్కార్ నిరాకరించింది.

ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ వరకు నడవనున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నుంచి వచ్చే బస్సులు హయత్ నగర్ వరకు అనుమతి ఇచ్చారు. వరంగల్ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ చౌరస్తా వరకు నడుస్తాయి. మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులకు ఆరాంఘర్ వరకు నడపనున్నారు. రాత్రి 7గంటలలోనే డిపోలకు బస్సులు చేరుకోనున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో శానిటైజేషన్, మాస్సులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

హైదరాబాద్ లో సిటి బస్సులకు ప్రభుత్వం అనుమతించలేదు. నగరంలో ప్రైవేటు సర్వీసులు, బస్సులు, సొంత వాహనాలకు ఆటోలు, కార్లు నిబంధనలు పాటిస్తూ తిరిగేందుకు అనుమతిచ్చింది. తెలంగాణలో లాక్ డౌన్ 4.0 సడలింపులు ఇవ్వడంతో రోడ్లపై వహనాల రద్దీ పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News