Sunday, May 5, 2024

అతి తీవ్ర తుఫాన్‌గా ఎంఫాన్

- Advertisement -
- Advertisement -
cyclone-amphan
 బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్న ఎంఫాన్

భువనేశ్వర్ : ఎంఫాన్ సోమవారం అతి తీవ్ర తుఫాన్(సూపర్ సైక్లోన్) గా మారి ఈశాన్య బంగాళాఖాతం వైపు పయణిస్తుందని భారత వాతావరణశాఖ(ఐఎండి) తెలిపింది. ఈ నెల 20న పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య దిఘా, హతియా దీవుల వద్ద తీరాన్ని దాటుతుందని ఐఎండి వెల్లడించింది. తీవ్ర తుపాన్‌గా మారిన తర్వాత బంగాళాఖాతంలో ఎంఫాన్ మరింత శక్తిమంతంగా తయారై తీరంవైపు నెమ్మదిగా కదలనున్నట్టు వివరించింది.

ఆ తర్వాత అది ఉత్తర, ఈశాన్య దిశల్లో కదిలి వాయువ్య బం గాళాఖాతంలో వేగం పుంజుకుంటుందని తెలిపింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే సమయంలో తీవ్ర తుపాన్‌గా మారుతుంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో తీవ్ర గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. దీని ప్రభావం ఒడిషా తీర ప్రాంత జిల్లాలపైనా ఉంటుందని ప్రత్యేక సహాయ కమిషనర్ పికె జెనా తెలిపారు.

ప్రభావిత జిల్లాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఒడిషా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఈనెల 21 వరకు సముద్రంలోకి వెళ్లొద్దని మత్సకారులకు ఆయన సూచించారు. ఇప్పటికే ఒడిషాలో 10, బెంగాల్‌లో 7 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.

most severe is amphan cyclone

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News