Sunday, May 5, 2024

రూ.పది వేల కోట్ల మేర పంట నష్టం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తుపాను వల్ల నష్టపోయిన ఎపి ప్రజలను ఆదుకోవాలని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి చంద్ర నాయుడు లేఖ రాశారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎపిలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని, 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని బాధను వ్యక్తం చేశారు. తుపాను ధాటికి ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. రూ.పది వేల కోట్ల మేర పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశామన్నారు. దాదాపుగా 770 కిలో మీటర్ల మేర రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు తీవ్ర నష్టం కలిగిందని, వ్యవసాయంతో పాటు ఆక్వారంగం కూడా నష్టపోయిందని బాబు స్పష్టం చేశారు. తుపాను నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని పిఎం మోడీని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News