Tuesday, April 30, 2024

ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది: శక్తికాంత్ దాస్

- Advertisement -
- Advertisement -

RBI Governor Shaktikanta Das holds a briefing

హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకులకు నగదు లభ్యత పెంచామని, గతంలో టర్మ్‌లోన్ల వాయిదాలపై మూడు నెలల మారటోరియం తీసుకున్నామని వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయన్నారు. కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఆహార ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 8.6 శాతానికి పెరిగిందని, దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందన్నారు. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గించామని, లోన్లపై వడ్డీ రేట్లు 0.40 శాతం తగ్గనుందన్నారు. రేపోరేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గించామని ప్రకటించారు. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని, ఈ ఏడాది జిడిపి వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందన్నారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగిందని, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగిందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని, తయారీ రంగంలో ఎన్నడూలేనంత క్షీణత నమోదైందని, మార్చి, ఏప్రిల్‌లో స్టీల్, సిమెంట్ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం ఉందని, ప్రపంచ వాణిజ్యం 13 నుంచి 32 శాతం వరకు తగ్గిందని, ఇండియా విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యూఎస్ డాలర్లు అని, ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News