Monday, May 20, 2024

అభిమానులకు బోయపాటి సర్ ప్రైజ్ గిఫ్ట్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

 

నందమూరి బాలకృష్ణ అభిమానులకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అదిరిపోయే సర్ ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బుధవారం బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా ‘బిబిఆర్ 3 ఫస్ట్ రోర్’ పేరుతో చిత్రయూనిట్ ఓ పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేశారు. ‘ఎదుటివారితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అని అడిగేదానికి .. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా ..లమిడి కొడుకా’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య మరోసారి అదరగొట్టాడు. అలాగే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవ్ లో ఉంది. టీజర్ ను చూస్తుంటే.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మరోసారి సెన్సెషన్ క్రియేట్ చెయనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ మూవీలో బాలయ్య అఘోరగా,  ఫాక్షనిస్ట్ గా  రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో మూడో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Balayya birthday special: BB3 First Roar teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News