Tuesday, April 30, 2024

రాహుల్ ప్రధాని అవుతారు

- Advertisement -
- Advertisement -

Deepika padukone said Rahul will become Prime Minister

 

యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు
అసలైన దేశభక్తి ఆయనలో కనిపిస్తుంది
బాలీవుడ్ నటి దీపిక గతంలో ఇచ్చిన ఇంటర్వూ వైరల్

న్యూఢిల్లీ : డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి దీపిక పడుకొనేకు సంబంధించిన ఓ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆమె ప్రశంసలు కురిపించిన పాత వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఓ జాతీయ మీడియా గతంలో నిర్వహించిన ఇంటర్య్వూలో.. రాహుల్ భవిష్యత్‌లో దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని, తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్ ముందుంటారని దీపిక చెప్పారు. అంతేకాకుండా అసలైన దేశభక్తి తనకు రాహుల్‌లో కనిపిస్తుందని, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మంచి నాయకుడికి ఆయనే సరైన ఉదాహరణ అని, ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందన్నారు. అయితే డ్రగ్స్ కేసులో భాగంగా శనివారం దీపిక విచారణ ముగిసినప్పటి నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది. ఓ వర్గానికి చెందిన వారు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జేఎన్‌యూ ఘటనపై కూడా దీపిక విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News