Tuesday, April 30, 2024

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

SOT police seized gutka packets in hyderabad

హైదరాబాద్: నిషేధిత గుట్కాను రవాణా చేస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మిరాజ్ గుట్కా 38బ్యాగులు, మొబైల్ ఫోన్, మారుతి ఎకో వాహనాని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ రూ.2,39,400 ఉంటుంది. నగరంలోని నాంపల్లికి చెందిన షాహెద్ మహ్మద్ వ్యాపారం చేస్తున్నాడు. షాహెద్ కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లు తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. తక్కువ ధరకు గుట్కాను తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. బీదర్ నుంచి గుట్కా తీసుకుని వస్తుండగా పోలీసులు ఖాజాగూడ, మల్కచెరువు వద్ద అదుపులోకి తీసుకున్నారు. 38బ్యాగుల్లో గుట్కా ప్యాకెట్లను తీసుకుని వస్తుండగా పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ సుధీర్ కుమార్, తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.

SOT police seized gutka packets in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News