Thursday, May 2, 2024

బలమైన నేత కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ చాలా బలమైన నేత
దక్షిణ భారతదేశంలో భవిష్యత్ ఉన్న నాయకుడు కెసిఆర్ ఒక్కరే
రాష్ట్రంలో కెసిఆర్ మంచిపాలన అందిస్తున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్‌ను చాలా బలమైన నేత అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్, బిజెపి ఎదుగుదలపై కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దక్షిణ భారతదేశంలో భవిష్యత్ ఉన్న నాయకుడని ఆయన కొనియాడారు. కెసిఆర్‌ను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని, బిజెపిని ఎదుర్కొనగలిగే సమర్ధ నాయకుడు కెసిఆర్ ఒక్కరేనని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో కెసిఆర్ మంచి పాలన అందిస్తున్నారని ఓవైసి ప్రశంసించారు. కొన్ని సీట్లు పోయినంత మాత్రాన రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఉండదన్నారు. బిజెపి పార్టీని తెలంగాణ ప్రజలు తప్పక అడ్డుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మేయర్ పదవిపై అసదుద్దీన్ స్పందిస్తూ తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ 44 సీట్లను నిలబెట్టుకున్నామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మద్ధతు అంశంపై నేడు తుదినిర్ణయం తీసుకుంటామని ఓవైసీ ప్రకటించారు. దీనిపై పార్టీ నేతలతో చర్చిస్తామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 మజ్లిస్‌కు మేయర్ పీఠం
2009లో మేయర్ పీఠాన్ని ఎంఐఎం పార్టీ దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 జిహెచ్‌ఎంసి పరిధిలో 150 డివిజన్‌లలో మొత్తం 56,99,015 ఓట్లు ఉండగా, 24,08,001 ఓట్లు పోలయ్యాయి. 44.15 శాతం మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో 1,310 మంది అభ్యర్థులు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ 149 స్థానాల్లో పోటీ చేసి 52 స్థానాలు గెలుచుకోగా బిజెపి 138 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించి కేవలం 5 స్థానాలను దక్కించుకుంది. ఎంఐఎం 70 స్థానాల్లో పోటీ చేసి 43 స్థానాలు గెలుచుకోగా 139 స్థానాల్లో పోటీ చేసిన టిడిపి అభ్యర్థులు 45 స్థానాల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ పోటీ చేయలేదు. అయితే మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోగలిగింది.

Asaduddin Owaisi Reacts on GHMC Polls Results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News