Sunday, May 5, 2024

రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా నవాండ్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు ఇంజన్‌లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. దీంతో రైలు వికారాబాద్ నవాండ్లి రైల్వేస్టేషన్ వద్ద ఆగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇంజన్‌లో షార్ట్ సర్యూట్ కారణంగా స్వల్పంగానే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను చూసి సిబ్బంది ప్రయాణీకుల బోగీల నుంచి ఇంజిన్‌ను వేరు చేసినట్లు ద.మ.రైల్వే సిపిఆర్వో తెలిపారు. తాండూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పుతున్నారని సిపిఆర్వో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఇంజిన్ లోకో ఓహెచ్‌లో మంటలు చెలరేగినట్లు ఆయన తెలిపారు. మరో ఇంజిన్‌ను తీసుకువచ్చి రైలును గమ్యస్థానానికి చేరుస్తామని ఆయన వెల్లడించారు. రైలు పునః ప్రారంభానికి మరో 40 నిమిషాలు పడుతుందని పేర్కొన్నారు. రైలు నిలిపివేయడంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు.

Fire broke out on Rajdhani Express at Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News