Monday, June 17, 2024

తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Telangana corona virus cases update

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 143 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 2.96 లక్షలకు చేరుకోగా 1614 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.92 లక్షల మంది కోలుకోగా 1815 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 82.4 లక్షలకు చేరుకుంది. గురువారం ఒక్క రోజే 28 వేల మందికి కరోనా టెస్టులు చేశారు. కరోనా కేసలు సంఖ్యలో తెలంగాణ 12వ స్థానంలో ఉండగా మహారాష్ట్ర (20.52 లక్షలు) తొలి స్థానం, కేరళ (9.88 లక్షలు) రెండో స్థానం, కర్నాటక (9.44 లక్షలు) మూడో స్థానం, ఎపి (8.88 లక్షలు) నాలుగో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News