Tuesday, April 30, 2024

నాసా పర్సెవరెన్స్ రోవర్‌తో త్వరలో అద్భుతాలు

- Advertisement -
- Advertisement -

Perseverance rover''s exciting work to happen in coming weeks

 

నాసా లీడ్ సిస్టమ్ ఇంజినీర్ విష్ణుశ్రీధర్ వెల్లడి

హోస్టన్ : నాసా పర్సెవరెన్స్ రోవర్‌తో వచ్చే కొన్ని వారాల్లో అద్భుతమైన పనులు జరుగుతాయని ఇండియన్ అమెరికన్‌లీడ్ సిస్టమ్ ఇంజినీర్ విష్ణుశ్రీధర్ చెప్పారు. న్యూయార్క్ లోని క్వీన్స్‌కు చెందిన శ్రీధర్ కాలిఫోర్నియా పసడెనా లోని నాసా జెట్ ప్రొపల్సన్ లేబొరేటరీలో మార్స్ 2020 పర్సవరెన్స్ రోవర్ సూపర్‌కామ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న శిలల్లో రసాయన సమ్మేళనాలను లేజర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా సూపర్‌కామ్ విశ్లేషిస్తుంది. అంగారక గ్రహం తాలూకు అనేక చిత్రాలను లేజర్ కిరణాలను తాము చిత్రీకరిస్తామని, మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డు చేస్తామని, సమీప భవిష్యత్తులో తాము హెలికాప్టర్‌ను గ్రహంపై ఎగరనిస్తామని అదే ఆ గ్రహంపై మొట్టమొదటి విమానం అవుతుందని శ్రీధర్ చెప్పారు. గత ఏడాది జులై 30న పర్సవరెన్స్ ప్రయోగం జరిగింది. గతనెల ఫిబ్రవరి 18న అది విజయవంతంగా అంగారక గ్రహంపై దిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News