Tuesday, May 14, 2024

బంజారాహిల్స్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు: ఇద్దరు సెక్స్ వర్కర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లు, నలుగురు విటులను బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్‌ప్రకాష్ బాసి, రమేష్ పటేల్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఆనంద్ బంజారా కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకుని వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడి చేసి విటులు ప్రశాంత్ గౌడ, గురు, లోకేష్ గౌడ, అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్స్ వర్కర్లు ఇద్దరిని పునరావాస కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

Police busts prostitution ring in Banjara Hills

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News