Monday, May 20, 2024

బార్టీకి మియామి టైటిల్

- Advertisement -
- Advertisement -

Ashley Barty wins prestigious Miami Open tennis title

 

ఫ్లోరిడా: టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మకమైన మియామి ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ కెనడాకు చెందిన 8వ సీడ్ బియాంకా ఆండ్రెస్కూను ఓడించింది. బార్టీ తొలి సెట్‌లో అలవోక విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బార్టీ 63తో తొలి సెట్‌ను దక్కించుకుంది. బియాంకా ఏ దశలోనూ బార్టీకి పోటీ ఇవ్వలేక పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన బార్టీ లక్షం దిశగా అడుగులు వేసింది. రెండో సెట్‌లోనూ బార్టీ దూకుడును ప్రదర్శించింది. 40 ఆధిక్యంలో ఉన్న సమయంలో బియాంకా పోటీ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీంతో బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News