Tuesday, April 30, 2024

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in Road accident at Suryapet

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని డీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో చిన్నారితో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనలో సమయంలో కారు లో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Two killed in Road accident at Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News