Friday, April 26, 2024

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

junior NTR tests Covid-19 positive

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నానంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఫ్యామిలీ మొత్తం హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను సంప్రదించిన వారందరూ కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా, తనకు కరోనా పాజిటివ్ అని ఎన్టీఆర్ ట్వీట్ చేసిన కొద్దిసేపట్లోనే స్పందనలు వస్తున్నాయి. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సందేశాలు పంపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News