Tuesday, May 14, 2024

మెగాస్టార్‌కి తమ్ముడిగా వరుణ్‌తేజ్

- Advertisement -
- Advertisement -

మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన ‘లూసిఫర్’ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహల్ లాల్ పోషించిన పవర్‌ఫుల్ పాత్ర తన తండ్రికి బాగా సూట్ అవుతుందని రామ్‌చరణ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ మోహన్ రాజాకు ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించే బాధ్యతలు అప్పగించారు. చిరు నటించబోయే ఈ 153వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇప్పుడు తాజాగా ఈ మెగా రీమేక్‌లో వరుణ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడని తెలిసింది.

‘లూసిఫర్’ ఒరిజినల్ వర్షన్‌లో హీరోతో పాటుగా మరో మూడు కీలకమైన పాత్రలు ఉన్నాయి. అందులో విదేశాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే యువకుడి పాత్ర ఉంటుంది. ఇది హీరో చెప్పినట్లు నడుచుకునే తమ్ముడి పాత్ర. మలయాళంలో ఆ క్యారక్టర్‌లో వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్ నటించాడు. అయితే ఇప్పుడు తెలుగు వర్షన్‌లో ఆ రోల్‌లో వరుణ్ తేజ్‌ని నటింపజేయాలని చూస్తున్నారట. కాగా కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఆర్.బి చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Varun Tej to play key role in Lucifer Remake

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News