Thursday, May 2, 2024

క్రేజీ మూవీతో టాలీవుడ్‌లోకి?

- Advertisement -
- Advertisement -

Malavika Mohanan Movie updates

మాళవిక మోహనన్.. తమిళంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయిన మలయాళీ బ్యూటీ. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్‌కు కూతురైన మాళవిక.. ‘పెట్టం పోలె’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో కూడా అడుగుపెట్టింది. రజనీకాంత్ నటించిన ‘పేట’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ధనుష్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తోన్న మాళవిక.. హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఇకపోతే సినిమాల్లో చాలా హోమ్లీగా కనిపించే మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. క్లీవేజ్ షోలతో కుర్రకారుకి గాలం వేస్తూ ఉంటుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, – డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందే సినిమాలో మాళవికని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. ఇదే నిజమైతే శంకర్ సినిమాలో హీరోయిన్ అందాల ఆరబోతకు కొదవ ఉండదు. మరి ఇప్పుడు రామ్‌చరణ్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News