Tuesday, April 30, 2024

ప్రపంచాధినేతల్లో మోడీ టాప్

- Advertisement -
- Advertisement -

PM Modi tops world leaders

మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్ సర్వే

వాషింగ్టన్: అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ డేటా ప్రకారం 13 మంది గ్లోబల్ లీడర్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యధిక రేటింగ్ కలిగి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ 64శాతంతో రెండో స్థానంలో నిలువగా, ఇటలీ ప్రధాని మారియో డ్రాగ్నీ 60శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 52శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 48శాతం ఓట్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకున్నారు. అఫ్గాన్‌లో బలగాల ఉపసంహరణ, తాలిబన్ల ఆక్రమణ వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ఐదో స్థానానికి పడిపోయారు.

త్వరలో అమెరికా పర్యటనకు ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత. తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, జో బైడెన్‌లు వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు జరిపారు. మార్చిలో క్వాడ్ సమ్మిట్ గురించి, ఏప్రిల్‌లో వాతావరణ మార్పులపై, జూన్‌లో జీ-7 సదస్సుపై చర్చించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల కొనసాగుతున్న సమయంలో మోడీ, బైడెన్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News