Sunday, June 16, 2024

కాబోయే భర్త మరణాన్ని తట్టుకోలేక లవర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం కలబురగినగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శృతి అనే యువతి(18), బంధువు హనుమంతు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్లికి ఆ జంట రడీగా ఉన్నారు. నవంబర్ నెలలో హనుమంతు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. ప్రేమికుడు, కాబోయే భర్త చనిపోవడంతో తీవ్ర మనోవేధనకు గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో శృతి ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News