Tuesday, April 30, 2024

విద్యా సంస్థలపై కరోనా రెక్కలు

- Advertisement -
- Advertisement -

14 students test Covid positive in Nursing

నార్సింగ్‌లోని ఓ కళాశాలల్లో 14మంది విద్యార్థులకు వైరస్
వీరి ద్వారా మరికొంతమంది వ్యాపిస్తుందని ఆందోళన
గ్రేటర్‌లో రెండు రోజులుగా 100పైగా నమోదైతున్న పాజిటివ్ కేసులు
నూతన సంవత్సర వేడుకలతో మహమ్మారి విజృంభిస్తుందని వైద్యుల హెచ్చరికలు

హైదరాబాద్: నగరంలో కరోనా పాజిటివ్ కేసులు విద్యాసంస్థలో నమోదు కావడంతో పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్నారు. తాజాగా నార్సింగ్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు చెందిన 14మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో తోటి విద్యార్థులు భయపడుతున్నారు. వీరి ద్వారా ఎంతమందికి సోకుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ మళ్లీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని కోరుతున్నారు. ఇంతకుముందే వైద్యశాఖ ఫిబ్రవరిలో వైరస్ విజృంభించే అవకాశముందని హెచ్చరించిందని, అప్పటివరకు గత ఏడాది తరహాల్లో డిజిటల్ పాఠాలు చెప్పాలంటున్నారు. కేసులు తగ్గేవరకు ఇంటివద్ద నుంచి చదువుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు. అర్ధవార్షిక పరీక్షలు కూడా ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్వహించాలంటున్నారు. విద్యాసంస్దల యాజమాన్యాలు ప్రభుత్వం హెచ్చరికలు చేసినప్పుడే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరువాత విద్యార్థులను గుంపులు చేర్చి పాఠాలు బోధిస్తున్నారని మండిపడుతున్నారు.

స్కూల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు క్యూ పద్దతి పాటించకుండా గుంపులుగా రావడంతో వారిలో ఎవరికి దగ్గు, జలుబు లక్షణాలున్న ఇతర విద్యార్థులకు సోకుతుందన విషయం మరిచిపోయి విద్యాసంస్దలు టర్మ్ ఫీజులు వసూలు చేసుకునే పనిలో పడ్డారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా గత వారం రోజలు నుంచి గ్రేటర్ హైదరాబాద్ నమోదైతున్న పాజిటివ్ కేసులు పరిశీలిస్తే ఈనెల 22వ తేదీన 91 మందికి, 23న 93మంది సోకగా, ఈనెల 24వ తేదీన 81మందికి, ఈనెల 25న 92 కేసులు, ఈనెల 26వ తేదీన 69 మందికి, ఈనెల 27వ 90 కేసులు, ఈనెల 28వ తేదీన అత్యధికంగా 110 కేసులు నమోదైనట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

క్రిస్‌మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగర ప్రజలు రోడ్లపై పెద్ద ఎత్తున సంచరిస్తున్నారని, అదే విధంగా షాపింగ్ మాల్స్, మార్కెట్లు జనం రద్దీగా కనబడుతున్నట్లు దీంతో మహమ్మారి రెక్కలు కట్టుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చలి తీవ్రత కూడా పెరగడంతో దాని ప్రభావంతో చాలామందికి వైరస్‌కు ఉండే లక్షణాలు ఉంటున్నాయని, వాటి పట్ల నిర్లక్షం చేయకుండా సమీపంలో ఉండే ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకలు హంగు ఆర్బాటంగా చేయకుండా పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులతో చేసుకోవాలంటున్నారు. అతిగా ప్రవర్తిస్తే కరోనా కాటు వేస్తుందని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News