Tuesday, April 30, 2024

ఝార్ఖండ్‌లో లీటరు పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు

- Advertisement -
- Advertisement -

25 per liter reduction on petrol in Jharkhand

ద్విచక్ర వాహనందారులకు మాత్రమే ఈ వెసులుబాటు

రాంచీ: పెట్రోలు ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కలిగేలా లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.25 ల వరకు తగిస్తున్నట్టు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. అయితే కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. రాష్ట్రంలో జెఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెట్రోలు ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేదలు తన ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నప్పటికీ పెట్రోభారాన్ని భరించలేక దాన్ని వినియోగించలేక పోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించేందుకు కూడా వెళ్ల లేని పరిస్థితి నెలకొందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ముఖ్యమంత్రి వివరించారు. రేషన్ కార్డు కలిగిన ద్విచక్రవాహనదారులు తమ మోటార్ సైకిళ్లు , స్కూటర్లలో పెట్రోల్ పోయించుకుంటే ఒక్కో లీటర్‌కు రూ. 25 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామన్నారు. ఇది వచ్చే జనవరి 26 నుంచి అందుబాటు లోకి వస్తుందని, ప్రతి పేద కుటుంబం నెలకు 10 లీటర్ల వరకు రీయంబర్స్‌మెంట్ పొందవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.98..52 గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News