Monday, April 29, 2024

జనవరి 1 నుంచి పిఎంకిసాన్ సాయం రైతుల ఖాతాల్లోకి జమ

- Advertisement -
- Advertisement -

PM Kisan 10th installment on January 1

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పిఎంకిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారం వెల్లడించింది. ఈ నిధుల్ని జనవరి 1న జమ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించి 10 వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 1న మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విడుదల చేస్తారని పిఎంవొ తెలియచేసింది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రైతు కుటుంబాల ఖాతాల్లో రూ. 20 వేల కోట్లకు పైగా సొమ్మును జమ చేయనున్నట్టు పేర్కొంది. దేశంలో అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో కేంద్రం ఏటా రూ. 6 వేలు చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ మొత్తాలను జమ చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News