Sunday, September 21, 2025

మూడు రోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టిన కమల్ హాసన్ ‘విక్రమ్’

- Advertisement -
- Advertisement -

Vikram BoxOffice Hit

బాక్సాఫీస్ హిట్

హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’ కేవలం మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లను రాబట్టింది. తమిళనాడులో వేరే చిత్రాలు ఏవీ విడుదల కానందున ఫ్రీరన్ లో బాక్సాఫీస్ వద్ద మరింత రాబట్టగలదని భావిస్తున్నారు. ఇదిలావుంటే ‘విక్రమ్’ దక్షిణాదిన బాగానే ఆడుతున్నప్పటికీ, హిందీ బెల్ట్ లో అంతగా ఆదరణ లభించడంలేదని తెలుస్తోంది. అయినా నిర్మాతలు ఏ మాత్రం దిగులు చెందడం లేదు. ఎందుకంటే కమల్ హాసన్ చిత్రం 2022లో బాగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలువబోతోంది. తమిళనాడులోనే ఈ చిత్రం రూ. 60 కోట్లు ఇప్పటికే ఆర్జించేసిందని వార్త. తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటి వరకు  రూ. 3 కోట్లు వసూలు చేసింది. కర్నాటకలో కూడా రూ. 3 కోట్లు రాబట్టింది.  చిత్ర సమీక్షలన్నీ ఈ చిత్రానికి అనుకూలంగా ఉండడంతో ప్రేక్షకులు ఆత్రుతతో చూస్తున్నారని తెలుస్తోంది. అయితే తెలుగునాట కమలహాసన్ ‘విక్రమ్’ సినిమా కంటే అడవి శేష్  నటించిన ‘మేజర్’ వసూళ్లలో మెరుగ్గా ఉందని భోగట్టా!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News