Monday, November 11, 2024

బిజెపికి బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

నలుగురు జిహెచ్‌ఎంసి
కార్పొరేటర్లు గుడ్‌బై
కాషాయానికి టాటా చెప్పిన
తాండూరు మున్సిపాలిటీ
ఫ్లోర్ లీడర్‌తో పాటు కౌన్సిలర్
మంత్రి కెటిఆర్ సమక్షంలో గులాబీ
కండువా కప్పుకున్న బిజెపి నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందుగానేఆ పార్టీకి ఊహించని విధంగా దెబ్బ తగిలింది. గ్రేటర్ పరిధిలోని నలుగురు కార్పొరేటర్ల తో పాటు తాండూరు మున్సిపాలిటీ ఫ్లోర్‌లీడర్, మరో కౌ న్సిలర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.మరో ఇరవై నాలుగు గం టల వ్యవధిలో హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్రమోడీ వస్తు న్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం బిజెపి నే తల్లో ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది. పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియక బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ వీడిన నేతలు వీరేనా…. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశంపై ఆరా తీసే పనిలో బిజెపి నేతలు నిమగ్నమయ్యారు.

ఊహించని కుదుపులపై అప్పు డే వారిలో అంతర్మథనం మొదలైంది. పార్టీలో అంతా స వ్యంగానే ఉందని కమలనాథులు ధీమాగా ఉన్న సమయం లో టిఆర్‌ఎస్ పార్టీ అదును చూసి దెబ్బతీసింది.ప్రధానంగా బిజెపిని వీడిన గ్రేటర్ పరిధిలోని నలుగురు కార్పొరేటర్లు ఇ టీవల ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయినవారిలో ఉండడం విశేషం. మోడీతో కలిసి నెల రోజులైన కాకముం దే…. వా రు టిఆర్‌ఎస్‌లో చేరడం కాషాయ పార్టీలో తీవ్ర విస్మయం నెలకొంది. పార్టీని వీడుతున్న వారికి ఆపేందుకు కమలనాథులు యత్నించేలోగానే వారంతా తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక తమ రాజకీయ ప్రస్థానమంతా కారుతోనే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా టిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బిజెపి చెందిన హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అలాగే తాండూరు మున్సిపాలిటీ బిజెపి ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్‌లు తదితరులు ఉన్నారు. అయితే వారితో పాటు మరి కొందమంది కార్పొరేటర్లు కూడా కారు వైపు అడుగులు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజెపిని వీడులనుకుంటున్న కార్పొరేటర్లు ఇప్పటికే టిఆర్‌ఎస్ చెందిన అగ్రనేతలను కలిసి మంతనాలు కూడా సాగించినట్లుగా తెలుస్తోంది. వీరి కూడా ఒకటి, రెండు రోజుల్లో టిఆర్‌ఎస్ గూటికి చేరడం తథ్యమన్న ప్రచారం సాగుతోంది. మొత్తం మీద రాజకీయ పరంగా మంచి జోషలో ఉన్న బిజెపికి అధికార పార్టీ అదునుచూసి ఆపరేషన్ ఆకర్శ్‌ను మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చేరికల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News