Monday, May 13, 2024

జడ్‌పి చైర్మన్లు, ఎంపిపిలకు చెక్ పవర్!

- Advertisement -
- Advertisement -

త్వరలో ఉత్తర్వులు జారీ
ఎంఎల్‌సిలు పోచంపల్లి,
కవిత విజ్ఞప్తులకుప్రభుత్వం
సానుకూల స్పందన

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇక నుంచి జిల్లా స్థాయిలో జెడ్‌పి చైర్మన్లు, మండల స్థాయిలో ఎంపిపిలకు చెక్ పవర్ ఇస్తూ రా ష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జిల్లా పరిషత్‌లలో జిల్లా పరిషత్ సి ఇఒ, అకౌంట్స్ ఆఫీసర్‌లకు జాయింట్ అ కౌంట్ ఉండేది. అలాగే మండల స్థాయిలో ఎంపిడిఒ, సూపరింటెండెంట్‌లకు జాయిం ట్ అకౌంట్ ఉండేది. అయితే గ్రామ స్థాయిలో సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఉంది. కానీ జిల్లా, మండల స్థాయిల్లో కూ జెడ్‌పి చైర్మన్లు, ఎంపిపిలకు లేదు. ఈ నేపథ్యంలో వారికి కూడా చెక్ పవ ర్ ఇవ్వాలని స్థానిక సంస్థల ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవితలు చాలా కాలం గా సిఎం కెసిఆర్‌ను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు విజ్ఞప్తులు చేశారు.

వారు చేసిన విజ్ఞప్తులపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారికి కూడా చెక్‌పవర్ ఇవ్వాలని నిర్ణ యం తీసుకుంది. ఇందుకు సంబంధించినఆదేశాలు లిఖిత పూర్వకంగా సంబంధిత శాఖ అధికారులు త్వరలో విడుదల చేయనున్నారు. దీని కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధులలో గ్రామ పంచాయతీలకు 85శాతం, ఎంపిపిలకు 10 శాతం, జెడ్‌పిలకు 5శాతం నిధులు వినియోగించుకునే వీలుంది. ఈ నిధుల కేటాయింపు, విడుదలలో ఆ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి వారికి చెక్ పవర్ దక్కనుంది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్‌కు, మంత్రి ఎర్రబెల్లికి కవిత, శ్రీనివాస్‌రెడ్డిలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News