Wednesday, September 24, 2025

మంత్రి గంగులను  ఫోన్ లో పరామర్శించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిసి సంక్షేమం , ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87)  మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి  బుధవారం కరీంనగర్ లో వారి నివాసంలో మృతి చెందారు. మరణ వార్త తెలుసుకున్న సిఎం కెసిఆర్ మంత్రి గంగులకు ఫోన్ చేసి పరామర్శించి, విచారం వ్యక్తం చేశారు. తండ్రి ని కోల్పోయిన బాధలో వున్న గంగులను సిఎం కెసిఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్య ఆత్మకు శాంతిని చేకూర్చాలని సిఎం కెసిఆర్ ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News