Monday, September 22, 2025

Love Marriage: 18 రోజుల్లో లవర్‌తో పెళ్లి… ఇంతలోనే

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ప్రేమించి అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి ఒప్పుకోవడంతో ఈ నెల 26న పెళ్లి నిశ్చయమైన కాసేపటికే ఈ ఇంట్లో విషాదం నెలకొంది. లారీని వెనక నుంచి బైక్ ఢీకొట్టడంతో ప్రియుడు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువణ్నామలై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తిరువేర్కాడులో మోహన్ రాజ్ అనే యువకుడు(25) ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. చిరువంజిపట్టుకు చెందిన మోహన్ రాజుకు ఓ వేడుకలో యువతి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇరువైపుల కుటుంబ సభ్యులను నిశ్చితార్థం చేసుకున్నారు. ఏప్రిల్ 26న వారికి వివాహం జరగనుంది. తామల్ ప్రాంతంలో మోహన్ రాజ్ బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో అతడు వాహనాన్ని ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలు గుండెలు విలిసేలా రోదిస్తుంది. ఎన్నో కలలు అడియాసలు అయ్యాయని కన్నీటి పర్యంతమైంది. ఇరుకుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News