Wednesday, May 8, 2024

వైసిపి పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్‌ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎపి బిఆర్‌ఎస్ క్యాంప్ కార్యాలయంలో గుంటూరు జిల్లాకి చెందిన మహబూబ్ బాషా ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకి చెందిన పలువురు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సంధర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని దుయ్యబట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని వైసిపి ప్రజాప్రతినిధులను ప్రజలు తరిమికొడుతున్నారని విమర్శించారు. సిఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యారని ఆరోపించారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి సర్కార్‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.

తెలంగాణ మోడల్ అభివృద్ది ఎపిలో జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతపురానికి చెందిన ఎండి రహమతుల్లా అలీ అహ్మద్, ఎండి ఇబ్రహీం, న్యాయవాది ఎండి ముజాఫర్ సమి,నిరసనమెట్ల శ్రీనాథ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లాం ప్రకాష్,నరసరావు పేటకు చెందిన దేవసహాయం సహా పలు జిల్లాలకి చెందిన నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News